అఫ్గానిస్తాన్‌తో స్వదేశంలో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో జింబాబ్వే (ZIM vs AFG) ఘన విజయాన్ని సాధించింది. జింబాబ్వే జట్టు అఫ్గానిస్తాన్‌పై ఇన్నింగ్స్ 73 పరుగుల తేడాతో గెలుపొంది, అఫ్గానిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 127 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ ఐదు వికెట్లు తీసి అఫ్గానిస్తాన్‌ను దెబ్బతీశాడు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే, బెన్ కర్రాన్ (121) శతకంతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 359 పరుగులు చేసింది. సికందర్ రాజా (65) కూడా రాణించాడు. దీంతో జింబాబ్వేకు 232 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో జియావుర్ రెహమాన్ షరీఫీ ఏడు వికెట్లు సాధించడం విశేషం.
232 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడిన అఫ్గానిస్తాన్, మరోసారి బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమై కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఇబ్రహీం జద్రాన్ (42), బహిర్ షా (32) పర్వాలేదనిపించినా, మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో అఫ్గానిస్తాన్‌కు ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన జింబాబ్వే ఆటగాడు బెన్ కర్రాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.









