AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గాజా యుద్ధానికి ఇజ్రాయెల్ కొత్త పేరు: ‘వార్ ఆఫ్ రివైవల్’గా నామకరణం

గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘన తర్వాత యుద్ధం మళ్లీ మొదలైంది. హమాస్ మరియు ఇజ్రాయెల్ (Israel) పరస్పరం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించుకున్నారని ఆరోపించుకుంటున్నాయి. వాస్తవానికి, తమ దళాలపై హమాస్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారంటూ శనివారం అంతా ఇజ్రాయెల్ ఆర్మీ గాజా స్ట్రిప్‌పై దాడులు చేసింది. అంతేకాకుండా, మళ్లీ గాజా స్ట్రిప్‌లోకి వచ్చేవారిని అడ్డుకుంటోంది. గాజావాసులపై దాడులు చేయడం ద్వారా హమాస్ కాల్పుల విరమణ ఉల్లంఘనకు ప్రయత్నిస్తోందని వైట్ హౌస్ ప్రతినిధులు సైతం ఆరోపించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో, ఇజ్రాయెల్ ప్రభుత్వం అప్రమత్తమైంది. హమాస్‌ను నిరాయుధులుగా మార్చే వరకు యుద్ధాన్ని విరమించేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. నెతన్యాహు దూకుడుగా వ్యవహరిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న గాజా యుద్ధానికి ఉన్న పేరును సైతం ఇజ్రాయెల్ ఆర్మీ మార్చింది. దీనికి ‘వార్ ఆఫ్ రివైవల్’ (War of Revival) గా నామకరణం చేసింది. ఇజ్రాయెల్ కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది.

మరోవైపు, ఈ పరిణామాల నేపథ్యంలో హమాస్ ప్రతినిధులు ఇబ్బంది పడుతూ ఈజిప్టు రాజధాని కైరోలో మధ్యవర్తులైన ఈజిప్టు, ఖతార్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ముందుకు సాగడానికి చేపట్టాల్సిన చర్యలను చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ సర్కార్ ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇజ్రాయెల్ దాడులను ప్రోత్సహిస్తుందా, లేక మధ్యవర్తులైన ఖతార్, ఈజిప్టు ప్రయత్నాలకు మద్దతిస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

ANN TOP 10