హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘K-ర్యాంప్’ (K-Ramp) చిత్రం బ్లాక్ బస్టర్ జర్నీని కొనసాగిస్తోంది. ఈ దీపావళికి విడుదలైన చిత్రాలలో ఛాంపియన్ గా నిలిచిన ఈ సినిమా, రోజురోజుకు కలెక్షన్లను పెంచుకుంటూ పోతోంది. మొదటి రోజు కంటే రెండో రోజు మరింత ఎక్కువ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, రెండు రోజుల్లో ఏకంగా రూ.11.3 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకుంది. సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో హీరో కిరణ్ అబ్బవరం టూర్స్ ద్వారా చేసిన ప్రచారం బాగా సక్సెస్ అయింది, ఫలితంగా సినిమాపై క్రేజ్ ఏర్పడింది.
‘K-ర్యాంప్’ చిత్రాన్ని మాస్, యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా బీ, సీ సెంటర్స్‌లో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది. సినిమాకు క్రిటిక్స్ నుంచి వచ్చిన రివ్యూలకు, బాక్సాఫీస్ వద్ద వస్తున్న కలెక్షన్లకు ఏమాత్రం పొంతన లేకుండా, రివ్యూలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ఆడియెన్స్ ఆదరణతో ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌ల మీద రైజింగ్ ప్రొడ్యూసర్ రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. వీకే నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్ వంటి నటులు ఇతర కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ‘రిచ్చెస్ట్ చిల్లర్ గయ్’ క్యారెక్టర్‌లో కిరణ్ అబ్బవరం చేసిన పర్ఫార్మెన్స్ ‘K-ర్యాంప్’ చిత్రానికి హైలైట్‌గా నిలిచిందని చెప్పవచ్చు.