మోదీ పర్యటనపై షర్మిల ట్వీట్
ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం సమస్యల పరిష్కారానికి ఎదురుచూస్తూ మోదీకి స్వాగతం పలుకుతోందని తెలిపారు. తొమ్మిదేండ్లు కావొస్తున్నా విభజన హామీలు నెరవేర్చకపోవడం బాధాకరమని, కేంద్రం బడ్జెట్లోనూ తెలంగాణకు ప్రత్యేక కేటాయింపులు లేవని, ఈ సభలోనైనా తెలంగాణకు నిధులు ప్రకటించాలని కోరుతున్నట్లు షర్మిల ట్విట్టర్లో పేర్కొన్నారు.
గల్లీ నుంచి ఢిల్లీ వరకు ‘కాళేశ్వరం KCRకు ATM’ అని BJP లీడర్లు బుకాయిస్తున్నారని, కానీ ఎంక్వైరీ చేయడం లేదని ఆరోపించారు. YSRTP కాళేశ్వరం అవినీతిపై ఢిల్లీకి వెళ్లి పోరాటం చేసిందని, CAG,CBIకి ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవని షర్మిల చెప్పారు. మీ రాజకీయ స్వార్థం కోసం తెలంగాణ ప్రజల సొమ్మును పణంగా పెట్టడం విచారకరమన్నారు. ‘ప్రధాని రాష్ట్రానికి వస్తే ఎదురెళ్లి సమస్యలు పరిష్కరించండి అని నిలదీసే దమ్ము దొర గారికి లేదు. చేతకాని దద్దమ్మలా ఫామ్‌హౌస్‌కే పరిమితమై, ప్రధాని వెళ్లిపోయాక అవాకులు, చెవాకులు పేల్చడం కేసీఆర్ గారికి అలవాటుగా మారింది. దొర గారి రాజకీయాలు, మొండివైఖరితో తెలంగాణకు అన్యాయమే జరుగుతోంది’ షర్మిల ట్వీట్ చేశారు.