- ఎఎన్ఎన్ ఆధ్వర్యంలో ప్రాణదాతలకు పురస్కారాలు
- వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ చేతులమీదుగా బ్రోచర్ లాంచ్
- ఎఎన్ఎన్ ప్రయత్నాన్ని అభినందించిన మంత్రి
హైదరాబాద్, మహా
తెలుగు మీడియా రంగంలో ప్రత్యేక ఒరవడితో దూసుకుపోతున్న ఎఎన్ఎన్ తెలుగు ఛానల్, అమ్మన్యూస్ నెట్ వర్క్ ఆధ్వర్యంలో మెగా డాక్టర్ అవార్డ్స్, బిజినెస్ ఎక్స్ లెన్స్ అవార్డ్స్ ను నవంబర్ లో ప్రధానం చేయనుండగా, ఇందుకు సంబంధించిన బ్రోచర్లను తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఎఎన్ఎన్ ప్రయత్నాన్ని అభినందించారు. అవార్డులు ఎలాంటివారికైనా ప్రోత్సాహాన్ని అందిస్తాయన్నారు. బిజినెస్ లోనూ ప్రత్యేక ఒరవడితో వ్యాపారరంగంలో చెరగని ముద్రవేస్తున్న వారికి , మార్గదర్శులుగా నిలిచేవారిని బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులతో సత్కరించాలని నిర్ణయించినట్లు ఈ సందర్భంగా ఎఎన్ఎన్ సీఈవో కంది రామచంద్రారెడ్డి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో అత్యుత్తమ సేవలందిస్తున్న డాక్టర్లు, వివిధ విభాగాల స్పెషలిస్ట్ లు, హాస్పిటల్స్, స్ఫూర్తిదాయక వ్యాపార వేత్తల ఎంపికకు, ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ లకు ఎంట్రీలను ఆహ్వానించినట్లు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖా మంత్రి దామోదర రాజనర్సింహ తో పాటు రాజకీయ, సినీ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ అవార్డుల వేడుకకు హాజరుకానున్నారు. మంత్రి చేతులమీదుగా బ్రోచర్ ఆవిష్కరణ జరగ్గా, కార్యక్రమంలో ఎఎన్ఎన్ సీఈవో కంది రామచంద్రారెడ్డి, బ్యూరో చీఫ్ గడ్డం క్రిష్ణమూర్తి, జీఎం మందడి అరవింద్ రెడ్డి, బిజినెస్, డిజిటల్ హెడ్ రాకేష్ పాల్గొన్నారు.