ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పాడి రైతులకు అవసరమయ్యే పశుగ్రాసం పెంచే దిశగా చర్యలు చేపట్టింది. రైతుల కోసం పశుగ్రాసం పెంపకం పథకాన్ని అమలు చేస్తుంది. ఇందుకోసం ఉపాధి హామీ పథకం ద్వారా 100 శాతం రాయితీతో పశుగ్రాసం సాగుకు చర్యలు చేపట్టింది. ఒక్కో రైతుకు గరిష్ఠంగా 50 సెంట్ల వరకు పశుగ్రాసం పెంచేందుకు ప్రోత్సాహం అందిస్తుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పశుగ్రాసం సాగుకు రైతుల నుంచి దరఖాస్తు ఆహ్వానించింది.
