ఆదిలాబాద్ నుంచి భారీగా బీజేపీ నాయకులు, కార్యకర్తల రాక
సందడిగా మారిన సికింద్రాబాద్ రైల్వే పరిసరాలు
తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: కంది శ్రీనివాసరెడ్డి
బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదిలాబాద్ నుంచి భారీగా సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. వీరి రాకతో రైల్వే పరిసరాలన్నీ సందడిగా మారాయి. రైల్వే స్టేషన్ లో జై మోదీ.. జై బండి సంజయ్.. జై కంది శ్రీనన్న నినాదాలు మిన్నంటాయి. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ దిశానిర్దేశంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు. అహర్నిశలు పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని చెప్పారు.