AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైసీపీ కి విజయ్ కిరణ్ షాక్.. తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ ఆధ్వర్యంలో భారీ నిరసన ..

  • వైసీపీ కి విజయ్ కిరణ్ షాక్
  • తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ ఆధ్వర్యంలో భారీ నిరసన
  • వైసీపీ ప్లకార్డుల దహనం.. ఉద్రిక్తత

గుంటూరు :

 

వైసీపీ తీరు పై తెలుగు యువత రాష్ట్ర నాయకులు విజయ్ కిరణ్ ఫైర్ అయ్యారు. గుంటూరు

లాడ్జి సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైసిపి నిర్వహించిన నిరసన కార్యక్రమానికి వ్యతిరేకంగా రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి ఎర్రమల విజయ కిరణ్ గుంటూరు నగర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సౌపాటి రత్నం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు . ఈ సందర్భాన్ని పురస్కరించుకొని విజయ కిరణ్ మాట్లాడుతూ ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో దళితుల్ని అన్ని విధాలుగా మోసం చేసి హత్యాకాండలు సాగించి అంబేద్కర్ విదేశీ విద్యను జగన్ విదేశీ విద్యగా పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ ను అవమానపరిచి తిరిగి అంబేద్కర్ విగ్రహం వద్ద కపటనాటకాలు ఆడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అధికారం పోయేసరికి అంబేద్కర్ విగ్రహం దగ్గర ముసలకన్నీరు కారుస్తున్న సైకో జగన్మోహన్ రెడ్డి మరియు పిల్ల సైకోలకు గట్టిగా బుద్ధి చెప్పే విధంగా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు . ఆ తరువాత అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో వైసీపీ మూకలు ఇష్టానుసారంగా వేసిన ప్లే కార్డులను ధ్వంసం చేయడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు దళితులను ఊచకోతకోసి, ధమనకాండ సాగించి దళితుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన 27 పధకాలను రద్దుచేసిన సైకో జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున అంబేద్కర్ మాట ఉచ్చరించే అర్హత లేదు. దళితులను దగా చేసిన, అంబేద్కర్ గారి పేరు మార్చి అవమాన పరిచిన జగన్ మోసపు రెడ్డి అంబెడ్కర్ గారి కాళ్ళదగ్గర క్షమాపణలు చెప్పనిదే, ఆయన విగ్రహాన్ని తాకే అర్హతకూడా ఉండదని, దళితులు రానున్న రోజుల్లో మరింత వ్యతిరేకత జగన్ రెడ్డికి రుచి చూపిస్తారని ఆయన అన్నారు. తదుపరి వైసిపి ప్లే కార్డ్స్ జెండాలు విగ్రహం చుట్టూ చెత్త వేసినట్టు వేసి పారవేసి, విగ్రహప్రాంతం మొత్తం చెత్తతో నింపి వేసారు వాటిని మొత్తం కుప్పలుగా పోసి తగులబెట్టే క్రమంలో పోలీసులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు తోపులాట జరిగినది.

ఈ కార్యక్రమంలో గుంటూరు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి సౌపాటి రత్నం, జిల్లా కార్యదర్శి పాటిబండ్ల బలరాం, తెలుగుదేశం పార్టీ నాయకులు తాళ్లూరి సురేష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10