ఖైరతాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఇన్ ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి బతుకమ్మ, దసరా శుభాకాంక్షల ఫ్లెక్సీల
జోరు కనబడుతోంది. ఎక్కడ చూసినా.. మన్నె గోవర్ధన్ రెడ్డి ఫొటోలు దర్శనమిస్తున్నాయి. త్వరలో ఖైరతాబాద్ నియోజకవర్గ బైపోల్ జరుగుతుందన్న ప్రచారం నేపథ్యంలో ఎంజీఆర్ స్పీడ్ పెంచారు. బస్తీల్లో పర్యటిస్తూ స్థానికులను పలకరిస్తున్నారు. గల్లీగల్లీ చుట్టేస్తున్నారు..