ఆదిలాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓట్ చోర్ గద్దీ చోడ్ ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాలతో ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంచార్జి కంది శ్రీనవాస రెడ్డి నేతృత్వంలో క్యాంపెయిన్ నిర్వహించారు. శనివారం జైనథ్ మండలం బెల్గాం గ్రామంలో బీజేపీ ఓట్ల చోరీపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలకు పత్రాలు పంచుతూ సంతకాలు తీసుకొని ఓట్లచోరీ పై సిగ్నేచర్ క్యాంపెయిన్ చేపట్టారు. నియోజక వర్గంలో ప్రస్తుత నూతన ఓటర్ లిస్ట్ లో ఏవైనా దొంగ ఓట్లు నమోదైతే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలని శ్రేణులకు సూచించారు.ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి, జైనథ్ ఆలయకమిటి ఛైర్మెన్ అడ్డి రుకేష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోషం రావు, సింగిరెడ్డి రాంరెడ్డి, బద్దం సంతోష్ రెడ్డి, కుంట కిష్ట రెడ్డి, రతన్ రెడ్డి, ఎల్మ రాంరెడ్డి, బస సంతోష్, మహమూద్, గ్రామస్తులు రవీందర్ రెడ్డి, గంగారెడ్డి, తిరుపతి, సామి రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
