ఆదిలాబాద్ : వెలమ సంఘ మిత్రులు, సన్నిహితులు, కుటుంబసభ్యులతో కలిసి బతుకమ్మ వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని పద్మనాయక గార్డెన్ లో వెలమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ సంబరాలలో కంది శ్రీనివాస రెడ్డి తో పాటు టీపీసీసీ మాజీ కార్యదర్శి గండ్రత్ సుజాత,కంది సాయిమౌనా రెడ్డి గిమ్మసంతోష్ వెల్మ సంఘ నాయకలు తదితరులు పాల్గొన్నారు. అందరితో కలిసి బతుకమ్మ పాటలకు లయ బద్దంగా స్టెప్పులేస్తూ నేతలు అలరించారు.
