తెలంగాణ రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ శుక్రవారం సాయంత్రం జీవోను విడుదల చేసింది. డెడికేటెడ్ కమిటీ సిఫార్సుల మేరకు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో నెంబర్ 9ని విడుదల చేసింది.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని ఇటీవల మంత్రి మండలి నిర్ణయించింది. ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 30 లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు గడువు విధించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల కోసం జీవో జారీ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.