AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు: కెసిఆర్

ఏసు క్రీస్తు శిలువ వేయబడిన రోజు, ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా ప్రజలకోసం ఏసు క్రీస్తు చేసిన త్యాగాలను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు స్మరించుకున్నారు. శిలువ మీద తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించమని భగవంతున్ని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు అని సిఎం ప్రశంసించారు. ‘గుడ్ ఫ్రైడే’ క్రైస్తవులకు పరమ పవిత్రమైన రోజని సిఎం అన్నారు. సమస్త మాన‌వాళి ప‌ట్ల ప్రేమ‌, నిస్సాహాయుల ప‌ట్ల జాలి, అవ‌ధులు లేని త్యాగం, సడలని ఓర్పు, శ‌త్రువుల ప‌ట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను కలిగివుండడం కరుణామయుడైన ఏసు క్రీస్తుకే సాధ్యమైందని కెసిఆర్ తెలిపారు.

ఈ లక్షణాలను ప్రతి ఒక్కరూ పుణికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మానవజాతికి శాంతి సహనం అహింస సౌభ్రాతృత్వాలను క్రీస్తు తన ఆచరణ ద్వారా సమస్త మానవాళికి సందేశంగా ఇచ్చాడని సిఎం పేర్కొన్నారు. విభేదాలు తారతమ్యాలు లేకుండా మనుషులంతా ఒక్కటిగా కలిసి వుండేందుకు ఏసుక్రీస్తు బోధనలు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. గుడ్ ఫ్రైడే ను ప్రజలు దైవ ప్రార్థనలతో జరుపుకోవాలనీ, ప్రజల మధ్య శాంతి, సామరస్యం విలసిల్లాలని ఈ సందర్భంగా సిఎం ఆకాంక్షించారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10