AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎంఆర్‌ఎఫ్‌ మెడికల్ బిల్లుల గోల్‌మాల్.. లక్షల రూపాయలు స్వాహా..

తెలంగాణ రాష్ట్రంలో సీఎంఆర్‌ఎఫ్‌ మెడికల్‌ బిల్లుల గోల్‌మాల్‌ జరిగినట్లు వెల్లడైంది. నకిలీ బిల్లులు సృష్టించి లక్షలు కొద్దీ డబ్బులు స్వాహా చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని రెండు ఆస్పత్రుల్లో బాధితులకు వైద్య చికిత్స అందించకుండానే.. చేయించినట్లు నకిలీ బిల్లులు సృష్టించారు. అంతేకాదు కొందరు కేటుగాళ్లు ఆస్పత్రికి LOC ఇప్పించి డబ్బులు కాజేశారు. ఈ విషయం వెలుగుకి రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. CMRF నిధుల గోల్‌మాల్‌పై పోలీసుల విచారణ మొదలు పెట్టారు. ఆ రెండు ఆస్పత్రులతో పాటు నలుగురిపై కేసు నమోదు చేశారు. వైద్యం చేయకపోయినా.. చేయించినట్టు నకిలీ బిల్లులు సృష్టించిన ఖమ్మంలోని వినాయక మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రితో పాటు.. మిర్యాలగూడలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌పై కేసు నమోదు చేశారు. నల్గొండకు చెందిన జ్యోతి, లక్ష్మి, దిరావత్, శివపై కేసు నమోదు చేశారు పోలీసులు.

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు.. అందుకనే ఆరోగ్యానికి సంబంధించి అన్ని ప్రభుత్వాలు పెద్ద పీఠను వేస్తాయి. ప్రజల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడానికి ఆ రాష్ట్రానికి చెందిన ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక పథకాలను, నిధులను ప్రవేశ పెట్టి అమలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా నిరుపేదలకు ఉచితంగా వైద్య చికిత్సను అందించడం కోసం ఆరోగ్య పథకాలతో పాటు.. ఇతర సదుపాయాలను కూడా కల్పిస్తున్నాయి. వాటిల్లో ఒకటీ సీఎం రిలీఫ్ ఫండ్..

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10