AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈ 22న చత్తీస్‌ గఢ్‌ ‌కు మంత్రి ఉత్తమ్‌, సీఎం శ్రీ విష్ణుతో సమావేశం..!

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఈ నెల 22న ఛత్తీస్‌ గఢ్‌ కు ‌వెళ్లనున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్‌ సాయితో సమావేశం కానున్నారు. సమ్మక్క సారక్క సాగర్‌ ప్రాజెక్టుకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(NOC) ఇవ్వాల్సిందిగా కోరనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నీటిపారుదల ప్రణాళికతోపాటు పలు అంశాలను నివృత్తి చేసుకునేందుకు కేంద్ర జలవనరుల సంఘం (CWC) 23న తెలంగాణ అధికారులతో సమావేశం కానుంది. ఈలోగా NOC తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

 

చత్తీస్ గఢ్ సీఎం అపాయింట్ మెంట్ కోరిన తెలంగాణ ప్రభుత్వం

అటు ఇవాళ (సెప్టెంబర్ 19న) ఛత్తీస్ గఢ్‌ సీఎం శ్రీవిష్ణును కలిసేందుకు అపాయింట్ మెంట్ కోరుతూ కొద్ది రోజుల క్రితమే తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే, ఈ నెల 22న కలిసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఐదుగురు నీటిపారుదలశాఖ అధికారులతో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చత్తీస్ గఢ్ కు వెళ్లనున్నారు. సెప్టెంబర్ 22న సాయంత్రం 4 గంటలకు రాయ్‌ పూర్‌ లో ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయిని కలుస్తున్నారు. వారి రాష్ట్రంలో ముంపునకు LAతో పాటు R&R లకు న్యాయమైన పరిహారం ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు తెలిపారు. ప్రాజెక్టుకు వచ్చే గరిష్ఠ వరదకు అనుగుణంగా ఏ మేరకు ముంపు ఉంటుందో.. ఆ మేరకు పరిహారం ఇవ్వడానికి తెలంగాణ తరఫున అంగీకారం తెలపనున్నారు.

 

సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ గురించి..

సమ్మక్క సారక్క ప్రాజెక్ట్ గోదావరి నది మీద నిర్మించే వ్యవసాయ ఆధారిత ప్రాజెక్టు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉంటుంది. సుమారు 30,000 క్యూసెక్కుల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 1.20 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరా చేస్తుంది. అదే సమయంలో 10 లక్షల మందికి తాగునీరు అందిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఎండాకాలం, వానాకాలం మధ్య అసమతుల్యతను సమతుల్యం చేస్తూ చక్కగా పంటలు పండేందుకు ఉపయోగపడనుంది. ఈ ప్రాజెక్టు కోసం తెలంగాన ప్ఱభుత్వం రూ. 5,000 కోట్లు పైగా ఖర్చు చేయబోతోంది.

 

చత్తీస్ గఢ్ లో మునిగిపోనున్న పలు గ్రామాలు

ఈ ప్రాజెక్టు కారణంగా చత్తీస్‌ గఢ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. కొన్ని భూములు, మరికొన్ని గ్రామాలు మునిగిపోయే అవకాశం ఉంది. అయితే, ముంపుకారణంగా నష్టపోయే వారికి తెలంగాణ ప్రభుత్వం న్యాయమైన పరిహారం అందించేందుకు అంగీకరించింది. మునిగిపోయే భూములకు మార్కెట్ రేటు ప్రకారం పరిహారం, కుటుంబాలకు కొత్త ఇళ్లు, ఉపాధి అవకాశాలు, విద్య, ఆరోగ్య సౌకర్యాలు అందించడం ద్వారా ప్రభావిత ప్రాంతాల ప్రజలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోనుంది. చత్తీస్ గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్ సమావేశం సందర్భంగా ఈ అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారు.

ANN TOP 10