ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఈవీఎంలపై గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలను పొందుపరిచేలా నిర్ణయం తీసుకోగా.. ఇది బిహార్ ఎన్నికల నుంచి కొత్త నిబంధలను అమలు లోకి వస్తాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
భారత ఎన్నికల సంఘం తీసుకున్న ఈ కీలక నిర్ణయం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. గత కొన్నేళ్లుగా దేశంలో ఈవీఎంలు ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే.. అభ్యర్థుల పేర్లు, పార్టీ చిహ్నాలు మాత్రమే చూపించడం, ముఖ్యంగా పేర్లు సమానమైన అభ్యర్థులు ఉన్నప్పుడు ఓటర్లకు గందరగోళ సమస్య ఏర్పడుతోంది. ఇప్పుడు, ఈ సమస్యకు స్థిరమైన పరిష్కారంగా, గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు ఈవీఎంలపై చూపించనున్నారు. ఇది ఓటర్లకు మరింత స్పష్టత, విశ్వాసాన్ని అందించనుంది.
కేంద్ర ఎన్నికల సంఘం 1961 ఎన్నికల నియమాలు 49-బి విధానం కింద, ఈవీఎం బాలెట్ పేపర్ల డిజైన్, ముద్రణకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై అభ్యర్థుల ఫోటోలు కలర్‌లో ముద్రించనున్నారు. ఇంతకు ముందు అభ్యర్థి ఫోటో ప్లేస్ లో ఇప్పడు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. అభ్యర్థులు, నోటా (నాన్ ఆఫ్ ది అబవ్) సీరియల్ నంబర్లు అంతర్జాతీయ భారతీయ అంకితాల్లో (1,2,3 వంటివి) 30 ఫాంట్ సైజులో బోల్డ్‌లో ముద్రించనున్నారు. అభ్యర్థుల పేర్లు అందరూ ఒకే ఫాంట్ రకం, పెద్ద సైజులో ఉంటాయి. తద్వారా చదవడం సులభం అవుతోంది. ఈవీఎం బ్యాలెట్ పేపర్లు 70 జీఎస్ఎం మందంతో ముద్రించబడతాయి. అసెంబ్లీ ఎన్నికలకు పింక్ కలర్ పేపర్ ఉపయోగిస్తారు. ఈ మార్పులు ఓటర్లకు, ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులకు ఎంతోగానూ తోడ్పడనుంది.
ఈ మార్పు మొదటిసారిగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి అమలులోకి వస్తుంది. ఇది అక్టోబర్, నవంబర్ నెలల్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. గతంలో 2015 నుంచి ఈవీఎంలపై బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు చేర్చారు. కానీ ఇప్పుడు కొత్తగా కలర్ ఫోటోలను చేర్చనున్నారు. ఇది ఎన్నికల సంఘం చేపట్టిన 28 కొత్త కార్యక్రమాల్లో ఒకటి. ఓటర్ల సౌకర్యం, పారదర్శకతను పెంచడానికి ఉద్దేశించినది.
ఈ నిర్ణయం ప్రజాస్వామ్య ఎన్నికల్లో ఓటర్లకు ఏంతోగానూ సహాయపడుతుంది. కొందరు సమానమైన పేరుతో ఉన్న అభ్యర్థులు ఓట్లను చీల్చే ప్రమాదం తగ్గనుంది. ఓటర్లు తమ అభ్యర్థిని సులభంగా గుర్తించి, సరైన ఓటు వేయగలరు. ఇది ఎన్నికల ప్రక్రియను మరింత డిజిటల్, వాస్తవికంగా మారుస్తుంది. చివరగా, ఈ మార్పు భారతదేశంలోని 90 కోట్ల ఓటర్లకు ఒక మంచి వార్త అని చెప్పవచ్చు.. ఎన్నికల సంఘం ఈ విధంగా ప్రజల స్వచ్ఛంద ఓటును బలోపేతం చేస్తూ, దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత దృఢపరుస్తోంది.