ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ సమావేశాలకు హాజరవుతారా? గతంలో మాదిరిగా డుమ్మాకొడతారా? అదే జరిగితే ఎమ్మెల్యేల సాలరీలు ఆగిపోతాయా? ఇవే ప్రశ్న చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ ఏ విధంగా అడుగులు వేయనున్నారు? అన్నదే అసలు ప్రశ్న.
ఏపీలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. శాసనసభ సమావేశాలు ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. సమావేశాలను అయితే 10 రోజులు లేకుంటే రెండు వారాల పాటు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో బిజినెస్ అడ్వైజరీ కమిటీ-BAC సమావేశాలు ఎన్ని రోజులు పెట్టాలనేది నిర్ణయిస్తుంది.