కోల్‌కత్తాలో కొత్త కేసు నమోదు..
ప్రస్తుత కాలంలో మారిన జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా కొత్త రకాల అనారోగ్యాలను మానవులు గురవుతున్నారు. మూడేళ్ల క్రితం వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించిందో? అందరికీ తెలిసిందే. దీంతో పరిశోధకులు ఎప్పటికప్పుడు కొత్త వ్యాధుల గురించి, అవి మానవాళిపై చూపే ప్రభావంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే తాజాగా భారతదేశంలో ఓ అరుదైన కేసు వెలుగుచూసింది. కోల్‌కత్తాకు చెందిన 61 ఏళ్ల వ్యక్తి కిల్లర్ ప్లాంట్ ఫంగస్ సంక్రమించింది.
ఈ అరుదైన వ్యాధికారక సంక్రమణ ప్రపంచంలోనే మొదటి కేసుగా నిలిచింది. దీంతో మొక్కల ఫంగల్ ఇన్ఫెక్షన్లు మానవులకు ఎలా వ్యాపించవచ్ఛు? అనే అంశంపై పరిశోధనలు మొదలు పెట్టారు. కొండ్రోస్టెరియం పర్పురియం అని పిలిచే ఈ మొక్క శిలీంధ్రం సిల్వర్ లీఫ్ వ్యాధిని కలిగిస్తుందని పరిశోధకులు తేల్చారు. ప్రధానంగా ఈ ఫంగస్ గులాబీ మొక్కలను ప్రభావితం చేస్తుందని వైద్యులు వివరించారు. ఈ ఫంగస్ మొక్కను కత్తిరించినప్పుడు బహిర్గతమయ్యే ప్రాంతంలో పెరుగుతుందని వెల్లడించారు. ప్రస్తుతం వచ్చిన ప్లాంట్ ఫంగస్ కేసు వచ్చిన వృద్ధుడు ఎక్కువగా పుట్టగొడుగుల వద్ద పని చస్తాడు. ఈ ప్లాంట్ ఫంగస్‌కు ఎక్కువ కాలం గురికావడం వల్ల అతని ఈ ఫంగస్‌ను వచ్చి ఉండవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రత్యేక ఫంగస్ జన్యుపరమైన గ్రహణశీలత వల్ల కూడా వచ్చే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.