AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అసెంబ్లీకి రాకుండా ఉన్న ఎమ్మెల్యేలకు ఎందుకు జీతాలు..! స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు..!

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజలు తమను ఎన్నుకున్నారనే విషయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు విస్మరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరై ప్రజల సమస్యలపై చర్చించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలపై ఉందని చెప్పారు. అయితే, కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి హాజరుకావడంలేదని విమర్శించారు. అసెంబ్లీకి డుమ్మా కొట్టినా నెలనెలా జీతం మాత్రం తీసుకుంటున్నారని విమర్శించారు. ఈ మేరకు తిరుపతిలో ఆదివారం నిర్వహించిన జాతీయ మహిళా సాధికారిత సదస్సులో అయ్యన్న పాత్రుడు ఈ వ్యాఖ్యలు చేశారు.

 

ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ.. ‘ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేది కేవలం 45 రోజులు మాత్రమే.. ఆ కొద్ది రోజులు కూడా అసెంబ్లీకి రాకపోతే ఎలా? ఉద్యోగులు విధులకు హాజరు కాకుంటే జీతంలో కోత పెడతారు. చిరుద్యోగులకు సైతం ‘నో వర్క్‌ – నో పే’ విధానం అమలుచేస్తున్నారు. కానీ, కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి హాజరు కాకున్నా పూర్తి జీతం తీసుకుంటున్నారు. ఈ విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై లోక్‌సభ స్పీకర్‌ మార్గదర్శకాలు ఇవ్వాలి’’ అని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరారు.

ANN TOP 10