భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాదిలో తొలిసారి తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు హైదరాబాద్ టూర్ కు సంబంధించి షెడ్యూల్ ఖరారు అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాదిలో తొలిసారి తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు హైదరాబాద్ టూర్ కు సంబంధించి షెడ్యూల్ ఖరారు అయింది. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ రాకతో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న మోదీ 12.30 గంటలకు తిరుగు పయనం కానున్నారు. అంటే దాదాపు 2 గంటలు మోదీ హైదరాబాద్ లోనే ఉండబోతున్నారు.
శనివారం ఉదయం 10.30 గంటలకు మోదీ హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడ బీజేపీ నేతలు ప్రధానికి ఘన స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాదు హైదరాబాద్-మహబూబ్ నగర్ రైవే డబ్లింగ్ పనులను కూడా ప్రధాని ప్రారంభించనున్నారు. అలాగే సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ఆయన ప్రారంభించనున్నారు. MTS సెకండ్ ఫేజ్ లో భాగంగా 13 MMTS రైళ్లను ప్రారంభించనున్నారు.