కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయన ఈ నెల 6న నగరానికి రావాల్సి ఉండగా, కొన్ని అత్యవసర కార్యక్రమాల కారణంగా ఈ పర్యటన వాయిదా పడినట్లు సమాచారం.
ఉపరాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయన పార్లమెంటు సభ్యులతో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. ఇదివరకే అమిత్ షా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వెలువడినప్పటికీ, చివరి క్షణంలో ఈ మార్పు చోటుచేసుకుంది. ఆయన రాక కోసం ఎదురుచూస్తున్న స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఇది నిరాశ కలిగించింది.