AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రజాసేవ భవన్ లో వినాయక చవితి సందడి.. విఘ్నేశ్వరుడికి కంది శ్రీనివాస రెడ్డి ప్రత్యేక పూజలు..

ఆదిలాబాద్ మహా : ఆదిలాబాద్ పట్టణంలోని కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ లో భక్తుల సందడి నెలకొంది. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ప్రజాసేవ భవన్ హాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి విఘ్నేశ్వరునికి వేద పండితుల శాస్త్రోక్త మంత్రాలతో తొలి పూజ నిర్వహించారు. ప్రజలందరూ సిరిసంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సుఖశాంతులతో జీవించాలని కంది శ్రీనివాస రెడ్డి వినాయకుడిని ప్రార్థించారు.

పూజ అనంతరం లంబోదరునికి ఇష్టమైన ప్రత్యేక నైవేద్యాలను సమర్పించారు. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ శ్రేణులు, కంది శ్రీనివాస రెడ్డి మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పూజలో పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ANN TOP 10