AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శాల‌రీ అడిగితే.. రాత్రికి రాత్రే జాబ్ నుంచి తీసేశారు.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల ఆవేద‌న‌..

శాల‌రీ అడిగినందుకు కంపెనీ నుంచి తీసుకొచ్చి పోలీస్ స్టేష‌న్‌లో కూర్చొబెట్టార‌ని, రాత్రికి రాత్రే జాబ్ నుంచి తీసేశార‌ని సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ ఘ‌ట‌న ఉప్ప‌ల్ పీఎస్ ప‌రిధిలో చోటుచేసుకుంది.

 

వివ‌రాల్లోకి వెళితే.. ఉప్ప‌ల్ ఐడీఏలోని ఐటీ పార్కులో ఫ్రూజెస్ ఐటీ స‌ర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నారు. మంగ‌ళ‌వారం నాడు డ్యూటీ ఉన్న స‌మ‌యంలో జులై నెల‌కు సంబంధించిన జీతాలు ఎప్పుడు ఇస్తార‌ని యాజ‌మాన్యాన్ని అడిగిన‌ట్లు వారు తెలిపారు. అంతే.. వెంట‌నే కంపెనీకి పోలీసుల‌ను ర‌ప్పించి 14 మంది ఉద్యోగుల‌ను ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్‌కు తీసుకొచ్చార‌న్నారు.

 

బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు త‌మ‌ను పీఎస్‌లోనే కూర్చొపెట్టి మ‌నోవేద‌న‌కు గురిచేశార‌ని వారు వాపోయారు. అయితే, ఉద్యోగులు గొడ‌వ చేయ‌డంతోనే కంపెనీ యాజ‌మాన్యం ఫిర్యాదు చేసింద‌ని పోలీసులు తెలిపారు. వారి ఫిర్యాదు మేర‌కే ఉద్యోగుల‌ను పీఎస్‌కు తీసుకొచ్చామ‌న్నారు

ANN TOP 10