ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) శుక్రవారం బీజేపీ (BJP)లో చేరనున్నారు. కొద్ది రోజుల క్రితమే ఆయన కాంగ్రెస్ (Congress) పార్టీకి రాజీనామా చేశారు. ఈరోజు 12 గంటలకు ఆయన బీజేపీ కండువా కప్పుకోనున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో పార్టీకి ఉపయోగపడతారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తిరిగి ఆయన యాక్టివ్ పొలిటిక్స్‌లోకి రావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఇవాళ బీజేపీ కేంద్ర నాయకుల సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరికపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.