ప్రధాని మోదీకి భట్టి బహిరంగ లేఖ..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క(CLP leader Bhatti Vikramarka) బహిరంగ లేఖ రాశారు. మోదీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో 30 ప్రశ్నలతో కూడిన లేఖను భట్టి విడుదల చేశారు. లేఖలో ప్రధాని మోదీకి భట్టి పలు ప్రశ్నల సందించారు.‘‘ మీ 9ఏళ్ల పాలనలో రాష్ట్రానికి కేటాయించిన పథకాలు, ప్రాజెక్టులు ఏమిటి..? కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలు ఏమయ్యాయి..? కాళేశ్వరం ప్రాజెక్టుపై(Kaleshwaram project) సీబీఐ విచారణ(CBI investigation) ఎందుకు జరపడం లేదు..మీకు కేసీఆర్కున్న(cm KCR) లోపాయికార ఒప్పందం ఏమిటీ..? కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సహారా, ఈఎస్ఐ కుంభ కోణాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు?. కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉన్న మద్యం కుంభకోణం కేసులో(Liquor scam case) పురోగతి ఎందుకు లేదు.? మీకు కేసీఆర్కు మ్యాచ్ ఫిక్సింగ్ అయిందా..? విభజన హామీలను ఎందుకు అమలు చేయడం లేదు.ఝ.గిరిజన యూనివర్సిటీ ఏమైంది’’ అని మోదీకి లేఖలో భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
![](https://anntelugu.com/wp-content/uploads/2025/02/78274145.jpg)