హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు రూ. 13.3 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి వద్ద ఈ భారీ మొత్తంలో ఉన్న హైడ్రోఫోనిక్ గంజాయిని గుర్తించి సీజ్ చేశారు.
గంజాయిని అక్రమంగా తరలిస్తున్న మహిళను అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించారు. గత నెల 30న కూడా బ్యాంకాక్ నుంచి వచ్చిన మరో మహిళ వద్ద రూ. 40 కోట్ల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. శంషాబాద్ విమానాశ్రయంలో తరుచూ గంజాయి పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.