AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జిమ్‌లో మెగా హీరోల కసరత్తులు..! ఫోటోలు వైరల్..

మెగా హీరోలు రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్ ఆదివారం జిమ్‌లో కలిసి సందడి చేశారు. కఠినమైన వర్కౌట్ తర్వాత ముగ్గురూ కలిసి దిగిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫిట్‌నెస్ విషయంలో తమకు వారాంతపు సెలవులతో సంబంధం లేదని ఈ మెగా బ్రదర్స్ మరోసారి నిరూపించారు.

 

ఈ ఫోటోను సాయి దుర్గ తేజ్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. “వీకెండ్ గ్రైండ్ విత్ ది క్రూ” (మా బృందంతో వారాంతపు కసరత్తు) అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ ఫోటో బయటకు వచ్చిన కొద్ది సేపటికే నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా, పూర్తి గడ్డంతో కండలు తిరిగిన శరీరంతో కనిపిస్తున్న రామ్ చరణ్ లుక్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చరణ్ కొత్త లుక్ అద్భుతంగా ఉందని, ఆయన్ను వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నామని కామెంట్లు పెడుతున్నారు.

 

రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసమే ఆయన ఈ రగ్డ్ లుక్‌లోకి మారారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తుండగా, ఆర్. రత్నవేలు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 

ఇక ఇతర హీరోల విషయానికొస్తే, వరుణ్ తేజ్ ప్రస్తుతం ‘కొరియన్ కనకరాజు’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండగా, సాయి దుర్గ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’ అనే చిత్రంలో నటిస్తున్నారు.

ANN TOP 10