అమెరికాలోని జార్జియాలో ఇటీవల రాలిన ఉల్కను పరిశీలించిన శాస్త్రవేత్తలు సంచలన విషయం గుర్తించారు. సదరు ఉల్క శకలం భూమికంటే పురాతనమైందని వెల్లడించారు. గత జూన్ 26న జార్జియాలోని మెక్డొనౌగ్లో ఓ ఇంటిపై ఉల్క శకలం పడింది. ఇంటి పైకప్పును శిథిలం చేస్తూ నేలను తాకింది. సూపర్ సోనిక్ వేగంతో భూమిపై పడినప్పుడు వచ్చిన శబ్దం చాలా దూరం వినిపించింది. చిన్న చెర్రీ పండు పరిమాణంలో 23 గ్రాముల బరువున్న ఈ శకలం తాకిడికి నేలపై చిన్న గుంత ఏర్పడింది.
ఈ శకలాన్ని పరిశీలించిన శాస్త్రవేత్తలు సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ శకలం దాదాపు 4.56 బిలియన్ సంవత్సరాల క్రితం తయారైందని జియాలజిస్టులు తెలిపారు. అంటే ఇది భూమి కంటే దాదాపు 2 కోట్ల సంవత్సరాల పూర్వం ఏర్పడిందని చెప్పారు. అంగారకుడు, బృహస్పతికి మధ్య ఉన్న ఓ తోకచుక్క నుంచి విడివడ్డ శకలం అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.