కుక్కల దాడిలో కృష్ణ జింక (Deer) మృతి చెందింది. వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం, హన్మపూర్ గ్రామంలోని ఒక వ్యవసాయ క్షేత్రంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యవసాయ క్షేత్రంలో కుక్కలు కృష్ణ జింకను వెంబడించాయి. వాటి బారి నుంచి తప్పించుకునేందుకు పరుగు పెట్టిన జింక పొలంలోని ఫినిషింగ్ వైర్ (Finishing wire)కు తగులుకోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. పైకి లేవలేని స్థితిలో ఉన్న జింకపై కుక్కలు దాడి చేసి చంపేసి తిన్నాయి. ఇది గమనించిన స్థానికులు అటవిశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న అధికారులు డాక్టర్ల సమక్షంలో పంచనామ నిర్వహించి జింకను అక్కడే ఖననం చేశారు.