AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. కోర్టు కీలక ఆదేశాలు..! కారణం అదేనా..?

మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు తెలిపింది. కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 లోగా కేసు నమోదు చేయాలని పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసు, నటి సమంత- హీరో నాగచైతన్య విడాకుల వ్యవహారంలో కేటీఆర్ పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

 

బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ పైన కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేశారన్న కేటీఆర్ న్యాయవాది వాదనలతో నాంపల్లి కోర్టు ఏకీభవించింది. సాక్ష్యుల ఫిర్యాదులు, డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత కొండా సురేఖపై కేసు నమోదు చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్, నాగచైతన్య- సమంత విడాకులకు కారణం కేటీఆర్, డ్రగ్స్ ఇలా నిరాధార ఆరోపణలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

 

కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావాను బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నెల 21 లోగా సురేఖకు నోటీసులు జారీ చేయాలని కూడా తెలిపింది. కొండా సురేఖ తరఫున న్యాయవాది చేసిన అభ్యంతరాలను కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. కేటీఆర్చేసిన ఫిర్యాదులో సరైన సమాచారం లేదని.. ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్ పరిధి తదితర అంశాలపై లేవనెత్తిన అంశాలను కోర్టు నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది.

 

కొండా సురేఖ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని.. కేటీఆర్ తరఫు న్యాయవాది చేసిన వ్యాఖ్యలను కోర్టు ఏకీభవించింది. ఈ క్రమంలోనే ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయవచ్చని పోలీసులు ఆదేశాలు జారీ చేసింది.

 

సమంత విడాకులకు కారణం కేటీఆర్: కొండా సురేఖ

 

కొన్ని నెలల క్రితం నాగచైతన్య, సమంత ఇద్దరు విడిపోవడానికి కారణం కేటీఆరే అని సంచలన ఆరోపణలు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సమంత, నాగచైతన్య విడాకులకు కేటీఆర్ కారణమని.. కేటీఆర్ డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యాడని.. డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్నారని కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే మంత్రి సురేఖ ఆరోపణలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని.. కేటీఆర్ కొండా సురేఖకు లీగల్ నోటీసులు సైతం పంపించారు. తన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కొండా సురేఖ దీనికి రియాక్ట్ అవ్వలేదు. దీంతో కేటీఆర్ నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ANN TOP 10