AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరిన కాళేశ్వరం కమిషన్ నివేదిక..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ నివేదిక అందింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ చేపట్టారు. దీనికి సంబంధించిన నివేదికను గురువారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. ఈ రోజు ఆ నివేదిక ముఖ్యమంత్రికి చేరింది.

 

కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అనేక వైఫల్యాలు ఉన్నాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు బాధ్యులని నివేదికలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. వ్యవస్థాగత విధానాలకు విరుద్ధంగా వ్యక్తుల ఇష్టానుసారం పనులు జరిగాయని, ఉన్నతస్థాయి ఒత్తిడులకు తలొగ్గి నిబంధనలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నాయని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం.

ANN TOP 10