AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సుప్రీంకోర్టు తీర్పుపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కీలక వ్యాఖ్యలు..!

ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది, ఆ తర్వాత అధికార పార్టీలో చేరిన పదిమంది ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెల్లం వెంకట్రావు స్పందిస్తూ, భద్రాచలం అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని వెల్లడించారు.

 

నియోజకవర్గంలో తనకు ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ ఉప ఎన్నికలు వచ్చినా తిరిగి గెలుస్తానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతోనే తాను గతంలోనూ నెగ్గానని అన్నారు. తాను చివరి వరకు ప్రజాసేవకే అంకితమవుతానని అన్నారు. ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించి సేవ చేసే అవకాశం కల్పించారని ఆయన అన్నారు.

ANN TOP 10