ఇరాన్ తో వ్యాపారం వద్దని తాము చెప్పినా వినకుండా చమురు కొనుగోలు చేస్తున్న కంపెనీలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 20 కంపెనీలపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ కు చెందిన ఆరు కంపెనీలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మన దేశంపై 25 శాతం టారిఫ్ లు విధించిన ట్రంప్.. చమురు కంపెనీలపై ఆంక్షలతో మరో షాక్ ఇచ్చారు. ఆంక్షలు విధించడంతో ప్రస్తుతం ఆయా కంపెనీలు, వ్యక్తులకు అమెరికాలో ఆస్తులు ఉంటే వాటిని ఫ్రీజ్ చేస్తారు.
‘మధ్య ప్రాచ్యంలో అస్థిరతకు ఆజ్యం పోస్తున్న ఇరాన్ పై ఆర్థిక ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా కఠిన చర్యలు చేపట్టింది. చమురు విక్రయాలతో ఇరాన్ కు సమకూరుతున్న నిధులను కట్టడి చేయాలని నిర్ణయించింది. ఇరాన్ నుంచి చమురు కొనుగోలు చేయొద్దంటూ ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. అమెరికా హెచ్చరికలను పెడచెవిన పెట్టిన 20 కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్నాం. ఇరాన్ చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తులను కొనుగోలు చేయాలనుకునేవారు అమెరికా ఆంక్షల ముప్పును ఎదుర్కోవాల్సి ఉంటుంది. అమెరికాతో వాణిజ్యం చేసేందుకు అర్హత కోల్పోతారు’ అని అమెరికా స్పష్టం చేసింది.
ఆంక్షలు ఎదుర్కోనున్న భారత కంపెనీలు..