మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పెద్ది’. ఈ సినిమాను స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిస్తున్నారు. క్రికెట్, కబడ్డీ, కుస్తీ వంటి స్థానిక ఆటల నేపథ్యంలో సినిమా ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీలో చెర్రీ ‘ఆట కూలీ’ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.
ఇక, ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చరణ్ మాసీవ్ గెటప్ కూడా సరికొత్తగా ఉండటం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న‘పెద్ది’ నుంచి త్వరలోనే ఫస్ట్ విడుదల కానుందని సమాచారం. వినాయక చవితి సందర్భంగా వచ్చే నెల 25న ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఫస్ట్ షాట్ పేరుతో విడుదలైన మూవీ గ్లింప్స్ ‘పెద్ది’పై అంచనాలు పీక్స్‌కి తీసుకెళ్లింది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ సంగీత సారధ్యంలో రూపొందుతున్న పాటలు పూనకాలు తెప్పించడం ఖాయమని అభిమానులు ధీమాగా ఉన్నారు. కాగా, ఈ మూవీలో చరణ్ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తుండగా.. వచ్చే ఏడాది రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.