సికింద్రాబాద్‌లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ వ్యవహారం సంచలనం రేపడంతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. సరోగసీ ద్వారా జన్మించిన చిన్నారుల విక్రయాలను తీవ్రంగా పరిగణించాలని హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.
ఈ అంశంపై విచారణ జరిపి ఆగస్టు 28లోగా నివేదిక సమర్పించాలని వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేసింది. సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్, సరోగసీ ద్వారా పిల్లలు లేని లోటును తీరుస్తామని చెబుతున్న సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ శిశు విక్రయాలు జరుపుతున్నట్లు వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు.