AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు కలిసి డిల్లీకి రావాలని మంత్రి పొన్నం ప్రకటన..!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ఢిల్లీకి వెళ్లనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రిజర్వేషన్లకు శాసనసభలో ఆమోదం తెలిపిన బీజేపీ, ఢిల్లీలో అడ్డుకుంటోందని ఆరోపించారు.

 

ఆగస్టు 5, 6, 7 తేదీలలో రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోరామని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరేవారందరూ తమతో కలిసి ఢిల్లీకి రావాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ సహా రాష్ట్రంలోని అన్ని పార్టీలలో ఉన్న బీసీ నాయకులు బీసీ రిజర్వేషన్ల కోసం సహకరించాలని కోరారు. న్యాయపరమైన చిక్కులు లేకుండా రాష్ట్రంలో కులగణన చేశామని అన్నారు. ఎన్నికలు ఆలస్యమైతే స్థానిక సంస్థల నిధులకు చాలా ఇబ్బంది అవుతుందని ఆయన అన్నారు.

ANN TOP 10