AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆపరేషన్ సిందూర్‌లో మేడిన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయి: ప్రధాని మోదీ

ఆపరేషన్ సిందూర్‌లో మేడిన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. తమిళనాడులోని తుత్తుకుడిలో నిన్న పలు ప్రాజెక్టులను ప్రారంభించిన సందర్భంగా జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఇప్పుడు భారత ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ మరియు ‘మిషన్ మాన్యుఫ్యాక్చరింగ్’పై గట్టి దృష్టి పెట్టిందని అన్నారు.

 

ఇటీవల ‘ఆపరేషన్ సిందూర్’లో మేక్ ఇన్ ఇండియా శక్తిని ప్రజలు ప్రత్యక్షంగా చూశారని ఆయన అన్నారు. భారత్‌లో తయారైన ఆయుధాలు ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేయడంలో కీలక పాత్ర పోషించాయని వివరించారు. ఇప్పటికీ భారత్‌లో తయారైన ఆయుధాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే నాయకులను రాత్రంతా నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ANN TOP 10