AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆసియా కప్ వేదిక ఖరారు..! ఎప్పుడు, ఎక్కడంటే…!

ఆసియా కప్ 2025 తేదీలు ఖరారయ్యాయి. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 28న ముగుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. దుబాయ్, అబుదాబి నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈసారి ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్ వే అయినప్పటికీ… తటస్థ వేదికలో (యూఏఈ) ఈ ఈవెంట్‌ను నిర్వహించడానికి బీసీసీఐ అంగీకరించింది.

 

ఆసియా కప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. భారత్, శ్రీలంక, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, యూఏఈ, ఒమన్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్ టీ20 ఫార్మాట్‌లో జరుగుతుంది. కాగా, ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్ , పాకిస్థాన్ ఒకే గ్రూపులో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండు జట్లు ఒకే గ్రూప్ లో ఉంటే… లీగ్ దశలో ఒకసారి, సూపర్-4 రౌండ్‌లో మరోసారి తలపడతాయి. కుదిరితే ఈ రెండు జట్లే ఫైనల్లోనూ ఆడే అవకాశం ఉంది.

ANN TOP 10