42 శాతం బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్‌ను న్యాయ సలహా నిమిత్తం కేంద్ర హోంశాఖకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించగా, తాజాగా ఆయన దానిని కేంద్ర హోంశాఖకు పంపించారు. దీనితో బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
సెప్టెంబర్ 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేశాకే స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళతామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఆర్డినెన్స్‌ను కేంద్రానికి పంపించడం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో సెప్టెంబరు 30లోగా స్థానిక ఎన్నికలు జరపాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.