AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో రెండు మెట్రో ప్రాజెక్టులకు కీలక ముందడుగు..

ఏపీలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చనున్నాయి. ఈ దిశగా నేడు కీలక ముందుడుగు పడింది. ఈ రెండు ముఖ్య నగరాల్లో మెట్రో ప్రాజెక్టులకు టెండర్లు పిలిచేందుకు చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమాన భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది.

 

మొత్తం రూ.21,616 కోట్లతో ఈ రెండు ప్రాజెక్టులకు టెండర్లు పిలవనున్నారు. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.11,498 కోట్లు, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.10,118 కోట్లతో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. మొదట ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నారు.

ANN TOP 10