AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత్, బ్రిటన్ మధ్య చారిత్రాత్మక ఒప్పందం..! వాణిజ్య ఒప్పందానికి సంతకాలు..

భారత్, బ్రిటన్ దేశాలు చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ సమక్షంలో ఇరుదేశాల వాణిజ్య శాఖ మంత్రులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు.

 

దీని ద్వారా భారత్ – బ్రిటన్ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావడంతో పాటు ఇరు దేశాల మధ్య ప్రతి సంవత్సరం 34 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుందని అంచనాలు ఉన్నాయి.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా బ్రిటన్ చేరుకున్నారు. లండన్ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. యూకేలో ఆయన రెండు రోజులు పర్యటిస్తారు. జులై 25, 26 తేదీల్లో మాల్దీవులలో పర్యటిస్తారు.

ANN TOP 10