AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విశాఖకు పెట్టుబడుల వెల్లువ..!

ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చొరవతో రాష్ట్రానికి పేరుమోసిన కంపెనీలు వస్తున్నాయి. తద్వారా విశాఖ మహానగర రూపురేఖలు మారబోతున్నాయి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 9వ ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో ఐటీ రంగంలో రూ.20,216 కోట్ల పెట్టుబడులు… 50,600 ఉద్యోగాలు కల్పించే నాలుగు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు.

 

గత ఏడాది కాలంలో మంత్రి లోకేశ్ చేస్తున్న కృషితో విశాఖ ఐటీ హబ్ గా రూపుదిద్దుకోనుంది. ఇటీవల మంత్రి లోకేశ్ బెంగుళూరు పర్యటన సందర్భంగా 35 వేల ఉద్యోగాలు కల్పించే రెండు ప్రముఖ సంస్థలతో ఒకేరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఆ రెండు సంస్థలకు తాజాగా జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో పచ్చజెండా ఊపారు. ఆ రోజున ఎంఓయూలు కుదుర్చుకున్న సత్వ డెవలపర్స్ సంస్థ విశాఖ మధురవాడలో రూ.1500 కోట్ల పెట్టుబడులు, 2 5 వేల ఉద్యోగాలు.. ఏఎన్ఎస్ఆర్ సంస్థ రూ.1000 కోట్ల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ని ఏర్పాటుచేయడం ద్వారా 10 వేలమందికి ఉద్యోవగాశాలు కల్పించనుంది.

 

అదేవిధంగా ఎస్ఐపీబీ ఆమోదించిన మరో ప్రముఖ సంస్థ సిఫీ ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్ విశాఖపట్నంలో డేటా సెంటర్ పై మొదటిదశలో రూ.1,466 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీనిద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. రెండవదశలో రూ.15,000 కోట్ల పెట్టుబడులు… 400 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇదిలావుండగా విశాఖ ఎండాడలో బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.1,250కోట్లతో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. తాజా ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన ఈ సంస్థ ద్వారా 15 వేల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.

 

ప్రఖ్యాత ఐటీ సంస్థలైన టిసీఎస్ (12 వేల ఉద్యోగాలు), కాగ్నిజెంట్ (రూ.1,583కోట్ల పెట్టుబడి, 8 వేల ఉద్యోగాలు) త్వరలో విశాఖ కేంద్రంగా తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. గత ఏడాది కాలంగా మంత్రి లోకేశ్ అవిశ్రాంత కృషితో రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ), డేటాసెంటర్లపై లక్షకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు, 95 ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి.

 

గత ఏడాది నవంబర్ లో లోకేశ్ చేసిన పెట్టుబడుల యాత్ర, జనవరిలో దావోస్ వేదికగా వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో జరిపిన చర్చలు ఫలవంతమై రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని సాకారం చేసేందుకు… పెట్టుబడులు, ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా మంత్రి లోకేశ్ చేస్తున్న ప్రయత్నాలు సాకారమవుతున్నాయి.

ANN TOP 10