AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ రెడ్డిని కలిసిన యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు..! స్థానిక సంస్థల ఎన్నికల పై చర్చ..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు కలిశారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన నాయకులకు 20 శాతం సీట్లు కేటాయించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేశారు.

 

తమ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ బలోపేతానికి కృషి చేసిన, అర్హత గల యువజన కాంగ్రెస్ నాయకులకు తగిన గుర్తింపునిచ్చి సీట్ల కేటాయింపులో సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు.

ANN TOP 10