AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రానా, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మిలకు ఈడీ నోటీసులు..!

బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన కేసులో ఈడీ పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మిలకు ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలంటూ వారికి తేదీలను ఖరారు చేసింది.

 

జులై 23న రానా దగ్గుబాటి, 30న ప్రకాశ్ రాజ్, ఆగస్టు 6న విజయ్ దేవరకొండ, ఆగస్టు 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.

 

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్లపై గతంలో నమోదైన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. పంజాగుట్ట, మియాపూర్, సూర్యాపేట, విశాఖపట్నంలో నమోదైన కేసుల ఆధారంగా విచారణ జరుపుతోంది. 29 మంది సినీ నటులు, యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లపై ఈడీ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ఈసీఐఆర్) నమోదు చేసింది.

 

నిందితులు జంగిల్ రమ్మీ, జీత్‌విన్, లోటస్ 365 తదితర బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్లు చేయడం వివాదాస్పదంగా మారింది. వీరి ప్రభావంతో పలువురు యువకులు బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు పోగొట్టుకోవడంతో పాటు కొంతమంది ఆత్మహత్యకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. బెట్టింగ్ యాప్‌ల ద్వారా నిర్వాహకులు కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని ఆరోపణలు ఉన్నాయి.

ANN TOP 10