AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాలీవుడ్ రామాయణంలో సీతగా సాయి పల్లవిని తీసుకోవడానికి కారణం అదేనట..!

భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ‘రామాయ‌ణ’ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రాముడిగా ర‌ణ్‌బీర్ కపూర్, సీత‌గా సాయిప‌ల్ల‌వి న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. అలాగే రావ‌ణుడి పాత్ర‌లో య‌శ్ న‌టిస్తుంటే.. హ‌నుమంతుడిగా స‌న్నీ డియోల్ క‌నిపించ‌నున్నారు. ఇక‌, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మేక‌ర్స్ పంచుకుంటున్నారు.

 

ఈ క్ర‌మంలో తాజాగా కీల‌క పాత్ర‌లు పోషించిన‌ ర‌ణ్‌బీర్ కపూర్, సాయిప‌ల్ల‌విని తీసుకోవ‌డం వెనుక ఉన్న కార‌ణాన్ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. రాముడిగా ర‌ణ్‌బీర్‌ను తీసుకోవడానికి కార‌ణం ఆయ‌న గొప్ప‌గా న‌టించే నైపుణ్యం, ప్ర‌శాతంమైన వ్య‌క్తిత్వం అని తెలిపారు. అలాగే సీతా దేవిగా సాయిప‌ల్ల‌విని తీసుకోవ‌డానికి కార‌ణం ఆమె గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు దూరంగా ఉండ‌టం, అందం కోసం స‌ర్జ‌రీలు చేయించుకోక‌పోవ‌డం అని మేక‌ర్స్ పేర్కొన్నారు. కృత్రిమం క‌న్నా స‌హజ అంద‌మే బాగుంటుంద‌నే సందేశం ఇచ్చిన‌ట్లు ఉంటుంద‌ని టీమ్ రామాయ‌ణ తెలిపింది.

 

ఇక‌, ఇప్ప‌టి విడుద‌లైన మూవీ గ్లింప్స్ రామాయ‌ణ‌పై అంచ‌నాల‌ను భారీగా పెంచేసింది. ఈ చిత్రం రెండు భాగాలుగా రానున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా మొద‌టి పార్ట్ 2026 దీపావ‌ళికి విడుద‌ల కానుంది. అలాగే రెండో పార్ట్ 2027 దీపావ‌ళికి వ‌స్తుంద‌ని ఇప్ప‌టికే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

ANN TOP 10