AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మళ్లీ రిస్క్ చేస్తున్న హరిహర వీరమల్లు నిర్మాత..! ఎందుకంటే..?

పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా హరిహర వీరమల్లు. వాస్తవానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడు అంచనాలు బీభత్సంగా ఉండేవి. దీనికి కారణం ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన గ్లిమ్స్ వీడియో. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే పాన్ ఇండియా సినిమా రాబోతుంది అని చెప్పినప్పుడు అందరికీ ఒక హై వచ్చింది.

 

కర్ణుడు చావుకి లక్ష కారణాలు అన్నట్లు ఈ సినిమాకి అడుగడుగున ఒడిదుడుకులే. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పటివరకు పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఒక తరుణంలో ఈ సినిమాను పవన్ కళ్యాణ్ చేయడం ఆపేస్తున్నారు అనే వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి ఈ సినిమా జులై 24న ప్రేక్షకులు ముందుకు రానుంది.

 

రిస్క్ చేస్తున్న నిర్మాత

 

నిర్మాత ఏం రత్నం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సాహిత్య రచయితగా, దర్శకుడిగా సినిమాలు చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. నిర్మాతగా కూడా భారీ సినిమాలు నిర్మించి మంచి సక్సెస్ ను చూశారు. పవన్ కళ్యాణ్ అంటే రత్నంకు ఒక ప్రత్యేకమైన అభిమానం. అందుకోసమే పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఎప్పుడు డేట్లు ఇస్తే అప్పుడు సినిమాను పూర్తి చేసి ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నాడు. ఈ సినిమా గురించి రత్నం ప్రతి దగ్గర చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు. ఈ సినిమాను తెలంగాణ ప్రాంతంలో మొదట మైత్రి తో మాటలు జరిగాయి, తరువాత దిల్ రాజు రిలీజ్ అన్నారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా నిర్మాతలు సొంతం గా విడుదల చేస్తున్నారు. దీనిపైన ఇప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. రిస్కు చేస్తున్నారు అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

ఖచ్చితంగా హిట్ అవ్వాల్సిందే

 

ఈ సినిమాకి సంబంధించి భారీ బడ్జెట్ కేటాయించారు. అంతేకాకుండా ఐదు సంవత్సరాలు క్రితం మొదలైన ఈ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తయింది. ఈ సినిమా మంచి టాక్ సంపాదించి భారీ కలెక్షన్లు వసూలు చేస్తే కానీ నిర్మాతలు బయటపడని పరిస్థితి. ఎందుకంటే ఈ ఐదేళ్లలో ఇంట్రెస్ట్ లు కూడా బాగా పెరిగి ఉంటాయి. మొత్తానికి ఎన్నో ఇబ్బందులు ఎదురుచూసి ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వస్తుంది. సినిమా పూర్తయిన తర్వాత కూడా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను కొనడానికి ముందుకు రాలేదు. మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమాకి ఫస్ట్ డే కలెక్షన్స్ వస్తాయి. సినిమాకు కానీ హిట్ టాక్ వచ్చిందా నిర్మాత సేఫ్ జోన్ కి వెళ్ళిపోయినట్లే.

ANN TOP 10