AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాచకొండ సీపీని అడ్డుకున్న మహిళా కానిస్టేబుల్..

మెచ్చుకున్న పోలీసు బాస్..రివార్డ్ కూడా.
తెలంగాణలో ప్రస్తుతం టెన్త్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షల పర్యవేక్షణకు ప్రభుత్వం పోలీస్, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులను ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలో రాచకొండ సీపీ పదో తరగతి పరీక్షా కేంద్రాలను సందర్శించే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఎల్బీనగర్ లోని పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ తో వెళ్తున్న రాచకొండ సీపీ చౌహన్ ను ఓ మహిళా కానిస్టేబుల్ అడ్డుకున్నారు. పరీక్ష కేంద్రంలోకి సీపీ ఫోన్ తో వెళ్లేందుకు ఆ మహిళా కానిస్టేబుల్ నిరాకరించింది. దీనితో అక్కడ ఉన్న ఉన్నతాధికారులు అంతా షాక్ కు గురయ్యారు.

దీనితో చేసేదేమి లేక సీపీ చౌహన్ మొబైల్ ను మహిళా కానిస్టేబుల్ కు ఇచ్చి పరీక్ష కేంద్రంలోకి వెళ్లిపోయారు. ఆ తరువాత బయటకు వచ్చిన సీపీ ఆ మహిళా కానిస్టేబుల్ ను అభినందించి రివార్డ్ కూడా అందజేశారు. ఎవరినీ కూడా ఫోన్ తో అనుమతించవద్దని సీపీ సూచించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనంతరం సీపీ మాట్లాడుతూ..”పదో తరగతి పరీక్షల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. సెల్ ఫోన్ లోపలి తీసుకెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదు. ర్యాంకుకు అతీతంగా సెల్ ఫోన్ బయటే ఉంచాలి. నేను పరీక్షా కేంద్రంలోకి వెళ్లే ముందు మహిళా కానిస్టేబుల్ నా ఫోన్ తీసుకున్నారు. ఆమె చేసిన పనికి నేను ప్రశంశిస్తున్నా. కానిస్టేబుల్ కల్పన గారికి రూ.500 రివార్డు ప్రకటిస్తున్నా” అని సీపీ చౌహన్ తెలిపారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10