AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జగన్ క్వాష్ పిటిషన్‌పై విచారణ రెండు వారాలకు వాయిదా..

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నిన్న హైకోర్టులో విచారణ జరిగింది. సింగయ్య మృతి కేసులో తమపై నమోదైన ఎఫ్‌ఐఆర్ కొట్టివేయాలని వైఎస్ జగన్‌తో సహా పలువురు వైసీపీ నేతలు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

 

ఇప్పటికే ఈ కేసు దర్యాప్తుపై ఉన్నత న్యాయస్థానం స్టే విధించింది. నిన్నటి విచారణ సమయంలో వాదనలు వినిపించేందుకు సమయం కావాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరడంతో విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

 

కాగా, వైఎస్ జగన్ పల్నాడు పర్యటనలో వైసీపీ కార్యకర్త సింగయ్య ప్రమాదవశాత్తు కారు కిందపడి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. దీనిపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనపై వైఎస్ జగన్‌తో పాటు కారు డ్రైవర్, పలువురు వైసీపీ నేతలను నిందితులుగా చేర్చి పోలీసులు కేసు నమోదు చేశారు.

ANN TOP 10