AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైసీపీకి మరో షాక్… మిథున్ రెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ..

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఆయన ఏ4గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నించారు. అయితే, ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు తిరస్కరించింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు నిన్న తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి దేశం విడిచిపోకుండా… ముందస్తు జాగ్రత్తలో భాగంగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

ANN TOP 10