AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బాలీవుడ్ రామాయణ బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!1000 కోట్లు కాదు.. రూ.4000 కోట్లు

రామాయణ ఇతిహాస కావ్యాన్ని తెరపై చూపించడానికి ఇప్పటికే ఎంతోమంది దర్శకులు ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ కూడా రామాయణ సినిమాను తెరపైకి తీసుకొస్తూ.. తమ కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే కొంతమంది దర్శకులు ఈ సినిమాను తెరకెక్కించి విమర్శలు ఎదుర్కోగా ఇప్పుడు మరో బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ (Nitesh Tiwari) కూడా డైరెక్షన్లో తన మార్క్ చూపించడానికి సిద్ధం అయ్యారు. తాజాగా ఈయన రామాయణం సినిమాను మరొకసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. రామాయణ పేరుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

 

7 ఏళ్ల క్రితమే ఈ సినిమా ప్రారంభం అయింది – నిర్మాత..

 

ఇదిలా ఉండగా ఈ సినిమా బడ్జెట్ పై రోజుకొక వార్త వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నిర్మాత నమిత్ మల్హోత్రా (Namith Malhotra) ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా బడ్జెట్ పై ఊహించని కామెంట్లు చేశారు. రామాయణ బడ్జెట్ రూ.1000 కోట్లు కాదు.. అంతకుమించి.. సినీ చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ తెలిపారు. ఇక ఇదే విషయంపై నమిత్ మల్హోత్రా మాట్లాడుతూ.. “మేము ఈ సినిమా కోసం నిధులు సమకూర్చుకుంటున్నాము. రామాయణం సినిమాతో చరిత్ర సృష్టించడానికి సిద్ధం అయ్యాము. అందుకే ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాలని అనుకోవడం లేదు. ఏడు సంవత్సరాల క్రితమే మేము ఈ సినిమా చేయడానికి కంకణం పూనుకున్నాము.

 

బడ్జెట్ రూ.1000 కోట్లు కాదు.. రూ.4000 కోట్లు

 

కోవిడ్ తర్వాత దీన్ని ప్రారంభించినప్పుడు ప్రజలు నన్ను పిచ్చివాడిని అనుకున్నారు. ఏ భారతీయ సినిమా కూడా రామాయణ దరిదాపుల్లోకి రాలేదు. రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రాన్ని సుమారుగా రూ. 4000 కోట్లతో రూపొందించనున్నాము. ప్రపంచమంతా ఈ ఇతిహాసాన్ని చూడాలన్న ఒకే ఒక్క లక్ష్యంతోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. అటు హాలీవుడ్ చిత్రాలకు అయ్యే ఖర్చు కంటే ఇది తక్కువే అని నేను భావిస్తున్నాను. తరాలు మారినా.. యుగాలు మారినా.. ఎప్పటికీ రామాయణం ఒక గొప్ప ఇతిహాసమే అంటూ రామాయణం పై, అలాగే ఆ సినిమా కోసం పెడుతున్న బడ్జెట్ పై స్పందిస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు మల్హోత్రా.

 

ఈ సినిమాతో ప్రపంచం దృష్టి భారత్ వైపే..

 

ఇక ఆయన మాట్లాడుతూ.. “భారతీయ సినిమాపై ఒకప్పుడు ప్రపంచం చిన్నచూపు చూసినప్పుడు నేను నిరాశకు గురయ్యాను. రామాయణ ప్రాజెక్టుతో ప్రపంచమంతా ఇక తప్పకుండా భారతదేశం వైపు చూస్తుంది” అంటూ తెలిపారు.

 

రామాయణలో నటీనటులు వీరే..

 

ఈ సినిమాలో రణబీర్ కపూర్(Ranbir Kapoor) రాముడి పాత్రలో.. సాయి పల్లవి (Sai Pallavi) సీత పాత్రలో, రావణాసురుడిగా యష్ (Yash), హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్ (Sunny Deol) కైకేయి పాత్రలో లారా దత్త(Lara Dutta), శూర్పనఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ ( Rakul Preet Singh) నటించనున్నట్లు సమాచారం. ఇకపోతే రావణాసురుడి భార్య మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) నటిస్తున్నట్లు వార్తలు వచ్చినా.. ఆమె మళ్ళీ తప్పుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై పూర్తి ప్రకటన వెలువడాల్సి ఉంది, ఇదిలా ఉండగా ఈ రామాయణం సినిమా ఇక మొదటి భాగం 2026 దీపావళికి.. రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కాబోతున్న విషయం తెలిసిందే

ANN TOP 10